సినిమా :  డాక్టర్ స్ట్రేంజ్  (Doctor Strange)

నటినటులు:  బెనెడిక్ట్ కుంబర్బట్చ్ , టిల్డ స్వింటన్ , రాచెల్ , చివేతెల్

దర్శకుడు :  స్కోట్ దేర్రిక్సన్

నిర్మాణం : మర్వెల్ స్టూడియోస్

ఒకరి తరువాత ఒకరిని, వరసపెట్టి సూపర్ హీరోలను వెండితెరకు పరిచయం చేస్తున్నా మర్వెల్ స్టూడియోస్ , ఈసారి డాక్టర్ స్ట్రేంజ్  అనే పాత్రని మనముందుకు తెచ్చింది. స్పైడర్ మాన్ వంటి అద్బుతమైన పాత్రను సృష్టించిన స్టీవ్ దిత్కో దీనికి ఆద్యుడు.

భవనాలను, రోడ్లను తలకిందులు చేస్తూ వదిలిన ట్రైలర్ తో ఆసక్తి కలిగి సినిమాకి వెళ్ళా. ఎలా ఉందొ చూద్దాం

కథ:  సినిమా ప్రారంభం లోనే కైసిలియాస్ అనే దుర్మార్గుడు, కాట్మండులోని ఆద్యాత్మిక గ్రంధాలయంలో పరిరక్ష్కుడిని చంపి కొన్ని విలువైన కాగితాలు దొంగిలిస్తాడు. ఎన్సేంట్ వన్ అనే గురువు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నితుంది. కానీ కైసిలియాస్ అతని అనుచరులతో పారిపోతాడు.

డాక్టర్ స్టేపెన్ స్ట్రేంజ్ అత్యంత ప్రతిబావంతమైన వైద్యుడు, కానీ పూర్తి తలబిరుసు మనిషి. ఒక కారు ప్రమాదంలో అతని చేతులకు తీవ్రగాయాలు అవుతాయి . ఎన్నో పరిక్షలు, సర్జరీలు జరిగినా ప్రయోజనం ఉండదు. వారించ బోయిన ప్రియురాలు క్రిస్టినా తో కూడా విడిపోతాడు. తనకు ఫిసియోతేరపి చేసిన డాక్టర్ చెప్పిన సమాచారంతో జోనాథన్ అనే వ్యక్తిని కలుస్తాడు. అతనికి ఎలా నయం అయ్యిందో కనుక్కుని  ఆ సమాచరం తో నేపాల్ లోని కాట్మండు బయలుదేరతాడు. అక్కడి ఎన్సేంట్ వన్ అనే గురువు యొక్క అద్బుత శక్తులు చూసి ఆశ్చర్యపోతాడు. ఇతని తలబిరుసుతనం వల్ల మొదట తిరస్కరించబడిన, తరువాత ఇతనికి అవిద్య నేర్పిస్తారు. ఏదైనా వేగంగా చదివి అర్డంచేసుకోగా స్ట్రేంజ్, ఆ గ్రందాలయము లోని పుస్తకాలు చదివి ప్రపంచాన్ని  న్యూయార్క్ , లండన్ , హాంగ్ కాంగ్ లలో ఉన్నా సంక్తమ్స్ అతీంద్రియ శక్తులనుంచి కాపాడుతుంటాయి అని తెలుసుకుంటాడు.

కాలాన్ని నియంత్రించే మంత్రాల ద్వారా వాటిని నాశనం చేసి ,  కైసిలియాస్  అతని అనుచరులు డుమము అనే ఒక దుష్ట శక్తి నీ ప్రపంచంలో ప్రవేశాపెట్టలనుకుంటారు. ఆ మంత్రాల కాగితాలే వారు దొంగిలిస్తారు. లండన్ సంక్తం నీ నాశనం చేసినప్పుడు స్ట్రేంజ్, కైసిలియాస్ నీ బంధిస్తాడు, కానీ తప్పించుకుంటాడు. ఆసమయంలో ఎన్సేంట్ వన్ అనే గురువు అదే కాలాన్ని నియత్రించే శక్తితో చాలాకాలం నుంచి జీవిస్తుంది అని తెలుసుకుని , ఆమెని నిలదిస్తాడు. తరువాత జరిగినా ఒక పోరాటంలో ఎన్సేంట్ వన్ మరణిస్తుంది. లండన్ సంక్తం కి ఇతనిని రాక్షకుడుగా నియమించి , డుమము రాకని ఆపమని చెప్తుంది.

హాంగ్ కాంగ్ సంక్తం నాశనం జరుగుతూ ఉండగా, స్ట్రేంజ్ అడ్డుపడతాడు , కానీ అప్పటికే డుమము పాక్షికంగా వచ్చేస్తాడు. తనకు తెలిసిన కాల నియంత్రణ విద్య ద్వారా డుమము నీ ఒక లూప్ లో నిర్బందిస్తాడు. అక్కడినుంచి విడుదలకు ఆస్కారం లేక విధిలేని పరిస్థితులలో తన అనుచరులను నాశనం చేసి , వెనక్కు వెళ్ళిపోతాడు డుమము. అన్సేంట్ వన్ కి ఇచ్చిన మాట ప్రకారం స్ట్రేంజ్ లండన్ సంక్తం రక్షకుడు గా కొనసాగుతాడు.

విశ్లేషణ : నాకు 3D సినిమాలు పెద్దగా నచ్చవు, కాని ఈ సినిమా 3D లోనే ఎక్కువ రిలీజ్ అవ్వడంతో దానికే వెళ్ళాను. చాలా మంచి 3D సినిమా చూసాను అన్న సంతృప్తి తో బయటకొచ్చాను. చూడడానికి సీరియస్ సినిమాలా కనిపించిన పూర్తి హస్యబరిత చిత్రం . బెనడిక్ట్ కంబర్ బట్చ్ నటన ఏంటో Imitation Game అని సినిమాతోనే తెలిసింది. ఇందులో హాస్యాన్ని అద్బుతంగా పండిచాడు. Inception సినిమాలోలాగే ఎందులోనూ భవనాలను, రోడ్లను తలకిందులు చేసే సన్నివేశాలు ఉన్నా, 3D లో ఇంకా అద్బుతంగా ఉన్నాయి. నాకూ బాగా నచ్చింది మాత్రం లండన్ సంక్తం కాపాడే సమయంలో కైసిలియాస్ నీ , స్ట్రేంజ్ బందిచే ఆయుధం. అలాగే స్ట్రేంజ్ ఆయుధం కూడా నవ్వుతెప్పించింది.

Advertisements