నటినటులు:  బిల్ స్కర్స్ గార్డ్,జడెన్ తదితరులు.

దర్శకుడు : ఆండీ ముస్చిటి

నిర్మాణం :  వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్

స్టేపెన్ కింగ్- నవలలు చదివేవారికి పరిచయం అక్కరలేని పేరు. హారర్, త్రిల్లర్ నవలలతో కోట్లాది మంది అబిమానులని సంపాదించుకున్నాడు. కింగ్ 1988 లో రాసిన నవలయే ఇట్. టీవీ సిరిస్ గా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. కధలోనికి వెళితే…

కథ:  1988 లో ఓ వర్షకాలం నాడు బిల్ అనే కుర్రాడు జార్జ్ అనే తన తమ్ముడికి ఒక కాగితం పడవ చేసి ఇస్తాడు. దానితో ఆడుకోవడానికి బయటికి వచ్చిన జార్జ్, పడవ డ్రైనేజీ లో పడిపోతుంది. దాన్ని వెతుకుతున్న జార్జ్ కి పెన్నివైజ్ అనే భూతం కనబడుతుంది. జార్జ్ నీ మాటలతో మభ్యపెట్టి డ్రైనేజీ లోకి లాక్కుపోతుంది.

ఒక సంవత్సరం తర్వాత, పిల్లలకి వేసవి సెలవులు ఇస్తారు. బిల్ కీ రిచి, ఎడ్డి, స్టాన్లీ అనే ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో కలిసి తన తమ్ముడు పడిపోయిన డ్రైనేజీ లాస్ట్ పాయింట్ వరకు వెళ్లి, కనీసం అతని శవం అయినా దొరుకుతుందేమో ప్రయత్నిస్తాడు. ఇలాంటి పరిస్థితులతో బెవర్లీ అనే అమ్మాయి, బెన్ అనే లావుపాటి అబ్బాయి వీళ్ళ గ్రూప్ లో కలుస్తారు. బెన్ నీ సీనియర్ గ్యాంగ్ కొడితే వీళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేస్తారు.

సినియర్ గ్యాంగ్ చిన్న పిల్లలని ఏడిపించడం, కొట్టడం లాంటివి చేసి వాళ్ళ దృష్టిలో విలన్స్ గా మారతారు. ఆ గ్యాంగ్ లీడర్ బేరన్స్. వీళ్ళ దాడినుంచి మైక్ అనే మరో పిల్లడు తప్పించుకుని పారిపోతు , ఈ గ్యాంగ్ నీ కలుస్తాడు అందరూ కలిసి బేరన్స్ గ్యాంగ్ మీద  ఎదురుతిరుగుతారు.

వీళ్ళ బాచ్ కి లూసర్స్ క్లబ్ అని పేరు పడుతుంది.

వీళ్ళ అందరి కి కామన్ గా వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. బెన్ దీనికి కారణం కనుక్కుంటాడు. ప్రతి 27 సంవత్సరాలకు ఇలాగా జరుగుతుందని , ఎంతో మంది చనిపోతున్నారు అని వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తాడు. ఈ సారి చిన్న పిల్లలు టార్గెట్ అని అర్దం చేసుకుంటారు.

వీళ్ళ లో ఒకడిని ,ఊరి చివర ఉన్నా ఇంటి దగ్గర ఆ భూతం కనపడి బయపెడుతుంది. దాంతో ఆ భూతం అంతు చూడాలని, తన తమ్ముడిలా ఎవరికీ జరగకూడదని బిల్ ఆ ఇంట్లోకి వెళతాడు, మొదట బయపడ్డ, చివరికి ఫ్రెండ్స్ కూడా అతనితో వెళతారు. ఆ భూతం వాళ్ళకి కనపడిందా? దాన్ని వాళ్ళు ఎం చేసారు అనేది మిగతా కధ.

విశ్లేషణ :  ఈ సినిమాలో రెండు విషయాల గురించి ముఖ్యoగా చెప్పుకోవాలి. ఒకటి పిల్లలు అందరి అద్బుత నటన. ఈ పిల్లల నేపద్యాలు వేరు వేరు.

బిల్- తమ్ముడిని కోల్పోయి బాధలో ఉన్నవాడు, తల్లితండ్రులు కూడా డిప్రెషన్ లో ఉంటారు.

బెవర్లీ- గ్రూప్ లో ఒకే ఆడపిల్ల, తండ్రి సెక్సువల్ పర్వర్ట్. అతని బారినుంచి తనని తనూ కాపాడుకుంటుంది.

బెన్- బాగా లావుగా ఉండే బెన్, బెవర్లీ నీ రహస్యంగా ప్రేమిస్తూ ఉంటాడు. తెలివైన వాడు.

మైక్- నీగ్రో పిల్లడు. తండ్రి అన్నా, వాళ్ళు చేసే మాంసం వ్యాపారం అన్నా నచ్హవు.

మిగిలిన వారు కూడా పేరెంట్స్ ప్రవర్తనతో విసిగిపోయి ఉంటారు. ఆయా పాత్రలో బాగా నటించారు.

రెండోది భూతం గా నటించిన బిల్ స్కర్స్ గార్డ్ గురించి. జోకర్ లాంటి పాత్ర ఇది, కామెడీ నీ, కర్కశత్వాన్ని, చివరి సీన్ లో భాదని కూడా అద్బుతంగా పలికించాడు. ఆ పాత్రకున్న మేకప్ దృష్ట్యా ఇది చాలా కష్తం.

బ్యాక్ రౌండ్ స్కోర్ కూడా బావుండి, ప్రేక్షకులకి కావలసినా భయాన్ని, త్రిల్ నీ ఇస్తుంది. హారర్ మూవీస్ నచ్చేవారు తప్పక చూడాల్సిన చిత్రం.

Advertisements