నటినటులు: జేమ్స్, ఐయ్నా టేలర్ తదితరులు.

దర్శకుడు : M. నైట్ శ్యామలన్

నిర్మాణం : యూనివర్సల్ పిక్చర్స్

M. నైట్ శ్యామలన్ – భారత సంతతికి చెందిన హాలివుడ్ దర్శకుడు. ది సిక్స్త్ సెన్స్ మూవీ తో హాలివుడ్ నీ షేక్ చేసాడు. ది విలేజ్, అన్బ్రేకబుల్ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నా, ఈ మధ్య వరసగా ఫెయిల్యూర్ లు తో డీలా పడ్డాడు. గతేడాది “ది విజిట్” సినిమాతో ఫాం లోకి వచ్చి, ఈ ఏడాది “స్ప్లిట్” సినిమా తీసాడు. విమర్శకుల ప్రశంసలతో పాటు, మంచి వసూళ్ళు కూడా సాధించింది. కధలోనికి వెళితే…

కథ:  కెవిన్ అనే వ్యక్తి మానసిక వికలాంగుడు, అతనిలోపల 23 పెర్సనాలిటీస్ ఉంటాయి. డాక్టర్ కరేన్ ఇతనికి ట్రీట్మెంట్ ఇస్తుంది. క్లైర్, మర్సియా, కేసి అనే ముగ్గురూ అమ్మాయిలని “డెనిస్” అనే కెవిన్ పెర్సనాలిటీ కిడ్నాప్ చేస్తుంది.

కెవిన్ నీ ఈ 23 పెర్సనాలిటీస్ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అందులో “డెనిస్” & “పెట్రియా” అనే రెండు పెర్సనాలిటీస్ ప్రధాన మైనవి. ఇవి “బీస్ట్” అనే 24వ పెర్సనాలిటీ నీ బయటకు రప్పించాడనికి ప్రయత్నిస్తాయి. “బీస్ట్” కి బలి ఇవ్వడానికి  ఈ ముగ్గురూ కన్నెపిల్లలను కిడ్నాప్ చేస్తారు. “హెడ్ విగ్” అనే 9 ఏళ్ళ పిల్లాడి పెర్సనాలిటీ ద్వారా ఈ విషయం ఆ ముగ్గురూ అమ్మాయిలకి తెలుస్తుంది. “హెడ్ విగ్” నీ ఫ్రెండ్ చేసుకుని, తప్పించుకొనే మార్గం కనుక్కోవాలి అని ముగ్గురు అమ్మాయిలు ప్లాన్ చేస్తారు. అది అర్ధం అయిన “డెనిస్” ముగ్గురిని వేరు వేరు గదులలో బంధిస్తాడు.

డాక్టర్ కరేన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం కెవిన్ నార్మల్ గా ప్రవర్తిస్తాడు. “డెనిస్” యే “బెర్రి” అనే  పెర్సనాలిటీ లా నటిస్తూ ఉంటాడు. కానీ తెలివిగా డాక్టర్ నిజం తెలుసుకుంటుంది. చిన్న తనంలో తన తల్లి పెట్టిన టార్చర్ మూలంగా కెవిన్ ఈ వ్యాది బారిన పడ్డాడు అని తెలుసుకుంటుంది. అతని మాటలను బట్టి “డెనిస్” యే అమ్మాయిలని కిడ్నాప్ చెయ్యవచ్చు అనుకుని, ఒకరోజు అకస్మాత్తుగా కెవిన్ ఇంటికి వెళుతుంది. అక్కడ డాక్టర్ కి  క్లైర్ కనబడుతుంది. తనని రక్షించేలోపు “డెనిస్” డాక్టర్నీ కూడా బంధిస్తాడు. “బీస్ట్” వచ్చే సమయం ఆసన్నమైందని, బయటకు వెళ్లి పోతాడు. కేసి కూడా చిన్నతనం లో చెడ్డ అనుభవాలు ఎదుర్కుంటుంది. అవి ఆమెకు కలలు గా వెంటాడుతుంటాయి.

బయటకు వెళ్లిన కెవిన్ తిరిగి వచ్చాడా? లేక “బీస్ట్” వచ్చిందా? డాక్టర్ కరేన్ మరియు మిగిలిన అమ్మాయిలు బ్రతికరా లేదా?  అనేది మిగతా కధ.

విశ్లేషణ :  ముందుగా చెప్పుకోవలసింది  కెవిన్ గా నటించిన జేమ్స్ గురించి, దర్శకుడు లాగే ఇతనికి కూడా కొన్ని రోజులుగా హిట్ సినిమా లేదు. ఒక మనిషి మెదడులో 23 పెర్సనాలిటీస్ ఉంటె ఎలా ఉంటుందో అద్బుతం గా నటించాడు. M. నైట్ శ్యామలన్ ఫుల్ ఫాం లోకి వచ్చినట్టే. చాలా క్లిష్టమైన కధని, అందరికీ అర్ధం అయ్యేలా, చాలా త్రిల్లింగ్ గా తెరకెక్కించాడు. అందుకే 9 మిలియన్ డాలర్స్ పెట్టి తీస్తే, 276 మిలియన్ డాలర్స్ వసూలు చేసి భారి విజయాన్ని దక్కించుకుంది.

Advertisements