నటినటులు: ఆండీ సేర్కిస్,వూడి హర్ల్సన్ తదితరులు.

దర్శకుడు : మాట్ రీవ్స్

నిర్మాణం : 20th సెంచరీ ఫాక్స్

గత 50 ఏళ్ళుగా ప్లానెట్ అఫ్ ఏప్స్  సినిమాలు జనాన్ని అలరిస్తున్నాయి. అందులో మూడో చిత్రం వార్ ఫర్ ది ప్లానెట్ అఫ్ ఏప్స్ , మొదటి రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. మొదటి చిత్రం లో హీరో ఒక చింపాంజీ నీ పెంచుకుంటాడు, దాని పేరు సిజర్. జూలలో ప్రయోగాల పేరుతో బాధలు పడుతున్న కోతులతో కలిసి తప్పించుకుని పారిపోతుంది. రెండో భాగంలో సీజర్ అనుచరుడు కోబా సిజర్ పై తిరుగుబాటు చేసి, ప్రజలమీద యుద్ధం ప్రకటిస్తాడు. అతనిని సిజర్ చంపేస్తాడు. ఇక మూడో భాగం కధలోనికి వెళితే…

కథ:  జనావాసానికి దూరంగా బ్రతుకుతున్న, చాలా తెలివైన కోతులు. వాటికీ నాయకుడు సిజర్ . ఆర్మీ వీటి మీద యుద్ధం ప్రకటిస్తుంది. ఆర్మీకి కోబాతో తిరుగుబాటు చేసిన కొన్ని కోతులు పనిచేస్తుంటాయి. ప్రారంభం లోనే ఆర్మీ వీటి సహాయంతో కోతుల గుంపు మీద దాడి చేస్తాయి. దాడిలో కోతులే గెలుస్థాయి. సిజర్ అందులో రెడ్ అనే కోతి నీ బందిoచి, బ్రతికిన సైనికులను వదిలేస్తాడు. తను యుద్ధం కోరుకోవడం లేదు అన్న సందేశాన్ని ఆర్మీ కల్నల్ కి అందజేయమంటాడు.

వీళ్ళు బంధించిన రెడ్ తప్పించుకుంటుంది. ఆ ప్రదేశం నుంచి మరో సురక్షిత ప్రదేశానికి వలస వెళ్ళాలని సిజర్ నిర్ణయిచుకుంటాడు. తన పెద్దకొడుకు, మరో కోతి రాకెట్ కలిసి ఒక అనువయిన ప్రదేశం ఒక ఎడారికి దగ్గరలో ఉందని కనిపెడతారు. బయలుదేరబోయే ముందురోజు రాత్రి ఆర్మీ కోతుల స్తావరం పై దాడి చేస్తుంది.   కల్నల్ సిజర్ భార్య, పెద్దకోడుకుని చంపేస్తాడు.

ప్రతీకారం తో రగిలిపోతున్న సిజర్ తన చిన్నకోడుకుని తన గుంపు తో పంపి,  కల్నల్ నీ వెతుకుతూ వెళతాడు. అతనితో పాటు మూరిస్, రాకెట్, లూకా లు కూడా వెళతారు. దారిలో వారికీ ఒక ముగ పిల్ల కనిపిస్తుంది. మూరిస్ ఆమెను తమతో పాటు తీసుకెళతాడు, నోవా అనే పేరుతో పిలుస్తారు. బాడ్ ఏప్ అనే మరో కోతి ద్వారా సైనిక స్థావరం కనుగొంటారు. సైనిక స్థావరం  ఉన్నా చోటా తమ గుంపు అంతా బందీలు అయిపోయారు అని కనుగొని వాళ్ళని రక్షించే ప్రయత్నంలో సిజర్ వాళ్ళకి దొరికిపోతాడు.

కల్నల్ ఆ కోతుల చేత ఒక గోడ కట్టిస్తూ ఉంటాడు. మనవ ప్రపంచంలో ప్రబలిన ఒక వ్యాది నుంచి కాపాడుకోవడానికి అడ్డువచ్చిన వాళ్ళ అందరిని చంపుతున్నట్లు, సిజర్ కి తెలుస్తుంది. అక్కడినించి తన వారిని, తన చిన్న కొడుకుని ఎలా కాపాడు కున్నాడు. అందరూ సురక్షిత ప్రదేశానికి చేరుకున్నారా?  అనేది మిగిలిన కధ.

 

విశ్లేషణ :  సిజర్ గా ఆండీ సేర్కిస్ ఆదరగోట్టేసాడు. అంతా CG ఎఫెక్ట్స్ మీద నడిచే ఈ సినిమాలో బావోద్వేగాలకు పెద్దపీట వేసారు. బాడ్ ఏప్ పాత్రతో కావలసిన వినోదాన్ని కూడా అందించారు. ఒక ట్రిలోజి కి చక్కని ముగింపు ఈ చిత్రం.

Advertisements