నటినటులు: అలెగ్జాండర్ స్కార్ర్స్ గార్డ్, అన్య టైలర్, ఈతన్ హాక్, నికోల్ కిడ్మన్.

దర్శకుడు : రాబర్ట్ ఎగెర్స్

నిర్మాణం : రేజెన్సీ ఎంటర్ప్రైజెస్, యూనివర్సల్ పిక్చర్స్.

ది లెజెండ్ ఆఫ్ అమ్లేత్ ఆధారంగా రూపొందించిన సినిమా ది నార్త్ మెన్. విలియం షేక్స్పియర్ రాసిన హామ్లెట్ నవలకి ఇదే మూలాధారం. కధలోనికి వెళితే…

కథ: కధా తొమ్మిదవ శతాబ్దంలో జరుగుతూ ఉంటుంది. ఒక యుద్ధం ముగించుకొని రాజు ఆర్వందిల్ తిరిగి తన రాజ్యానికి వస్తాడు. కొడుకు అమ్లేత్ నీ తన వారసుడిగా ప్రకటించడానికి సిద్ధమవుతాడు, దానికి సంబంధించిన ఒక క్రతువు పూర్తి చేస్తాడు. కానీ తర్వాత రోజే తన సవతి సోదరుడు చేత హత్య చేయబడతాడు. సవతి సోదరుడు రాజ్యాన్ని ఆక్రమించి రాజు భార్యని బంధిస్తాడు. అమ్లేత్ నీ కూడా చంపమని ఆదేశిస్తాడు, వేరే దారి లేని అమ్లేత్ అక్కడి నుంచి పారిపోతాడు ఎలాగైనా తిరిగి వచ్చి తన తండ్రిని చంపిన వారి మీద ప్రతీకారం తీర్చుకుంటానంటా నని శపదం చేస్తాడు. అమ్లేత్ ఒక వైకింగ్స్ జట్టుతో చేరి పెరిగి పెద్దవాడు అవుతాడు. ఒకసారి ఈ వైకింగ్స్ ఒక ఊరి మీద పడి దోచుకుంటారు. అక్కడ అమ్లేత్ కి తన బాబాయ్ రాజ్యాన్ని కోల్పోయాడని ఒక ఐలాండ్లో తలదాచుకుంటున్నాడని తెలుస్తుంది. అక్కడికి వెళ్లే బానిసల్లో ఒకడిగా తను మారువేషం వేసి తన బాబాయి ఉండే ప్రాంతానికి వెళ్తాడు. ఆ బానిసల్లో ఓల్గా అనే అమ్మాయిని కలుసుకుంటాడు. ఓల్గా ఒక మంత్రగత్తే, ఆమెకి తన గతం చెబుతాడు. అప్పటికే బాబాయ్ తన తల్లిని పెళ్లి చేసుకొని కుంటాడు, వాళ్ళిద్దరికీ గన్నర్ అనే ఒక కొడుకు కూడా పుడతాడు. అక్కడున్న ఓ మంత్రగాడు సలహాతో తను బాబాయిని చంపడానికి ఉపయోగపడే కత్తి గురించి తెలుసుకుంటాడు, ఆ కత్తి కాపలాగా ఉన్న అతన్ని చంపి కత్తిని సంపాదిస్తాడు. బాబాయ్ ఓల్గాని చెరపడదామని చూస్తాడు. ఓ సందర్భంలో గన్నర్ ని కాపాడడంతో బాబాయ్ పెద్ద కొడుకు బానిస పని నుంచి కొంత విముక్తిని ఇస్తాడు. అలాగే ఒక అమ్మాయిని కానుక ఇస్తాను కోరుకోమంటాడు, అప్పుడు ఓల్గా ని ఎంచుకుంటాడు. అక్కడి నుంచి ఓల్గా సాయంతో తన బాబాయిని అంతమొందించి తన తల్లిని రక్షించుకోవాలనుకుంటాడు.ఆ ప్రయత్నంలో అమ్లేత్ విజయం సాధించాడా అతనికి ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: వైకింగ్స్ తరహా కథలు హాలీవుడ్లో కొత్త కాదు, కాకపోతే ఈ సినిమా వాటితో పోలిస్తే కాస్త కొత్తగా ఉంటుంది. హామ్లెట్ కథ తెలిసిన వారికి ఈ స్టోరీ కొత్తగా ఏమీ అనిపించదు, కానీ దర్శకుడు ఒక డిఫరెంట్ సెట్ అప్ తో ఈ సినిమా తీశాడు. తొమ్మిదో శతాబ్దం నాటి పరిస్థితులు, అప్పటి మూఢనమ్మకాలు, రాజకీయాలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. ఇందులో నటీనటులు అందరికీ బలమైన పాత్రలు లభించాయి, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆమ్లెట్ తల్లిగా చేసిన నికోల్ కిడ్మన్ గురించి. ఒక విధమైన డార్క్ క్యారెక్టర్ చేసింది. సినిమా చాలా నిదానంగా సాగుతుంది, థియేటర్లలో ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఆన్లైన్లో మంచి రెస్పాన్స్ రాబట్టింది. కాబట్టి కుదిరితే మీరు చూడొచ్చు